Thursday, June 1, 2023

శిరోజాలు రోజాలు

 దువ్వి దువ్వి దువ్వాలమ్మా

జులపాలమ్మా

దువ్వకుంటే చిక్కేనమ్మా పెద్ద చిక్కేనమ్మా


అందం చందం పెంచేనని ఆ నూనె సీసానే నమ్ముకుంటే

అందం చందం పెంచేనని ఆ నూనె సీసానే నమ్ముకుంటే

గుండే చివరకు మిగిలింది గుండె పగిలే లాగా ఏడ్చావమ్మ

అద్దం ముందు నిలబడి చూసుకున్నా వా  నిన్నే గంటల తరబడి

గుర్తించకున్నావా ఈనాడు కలగనలేదా ఓ నాడు


                                      దువ్వి ....దువ్వి ....దువ్వి

                                           దువ్వి దువ్వి దువ్వి

                                           దువ్వి దువ్వి దువ్వాలమ్మా

                                              జులపాలమ్మా


జుట్టు ఉంటేనే గుర్తించారా అది  లేకుంటే నిన్నే ఆట పట్టించారా

జుట్టు ఉంటేనే గుర్తించారా అది  లేకుంటే నిన్నే ఆట పట్టించారా

ఆగని నీ వ్యధలన్నీ ఆగే రోజే మున్ముందు వచ్చేనమ్మా

విగ్గున గుండును దాచి నువ్వు మోగ్గా లాగా నవ్వే రోజు 

ముందుందమ్మా ఆరోజు తప్పక వస్తుందమ్మా ఆ రోజు


దువ్వి ....దువ్వి ....దువ్వి

                                           దువ్వి దువ్వి దువ్వి

                                           దువ్వి దువ్వి దువ్వాలమ్మా

                                              జులపాలమ్మా



జులపాలమ్మా

దువ్వకుంటే చిక్కేనమ్మా పెద్ద చిక్కేనమ్

Sunday, January 12, 2020

అల software కొలువులో


Dedicated to all the frustrated software engineers. My try on a parody to బుట్ట బొమ్మా song

ఇంత కన్నా పెద్ద effortu ఏదీ పెట్టలేనుగాని వామ్మో   .నేనింక వెళ్ళలేను బాబు gymu
అనుకుంటే అనుకోని అందరూ నన్ను drummu
తెలిసిన వాళ్లంతా చుట్టూ చేరి బుర్ర తినేస్తున్నారు కదా వామ్మో నేనైతే దులిపేసుకున్నానీ దుమ్ము
నాకేదీ వినపడదులే ఇక నమ్ము

ఇంతగా ఈ గోల ఎందుకో
మీకిదే నా వేడుకోలురో
దేవుడా నన్ను వదిలి మీ పనులనిక చేసుకోండిరో

బట్ట ఉన్నా పొట్ట ఉన్నా అది నా problemmu రో
బంక మన్నై నన్ను పట్టి మీరిక పీడించవద్దురో.   ---2

ఇప్పటికినీ డైటింగు walkingu అన్నీ చేస్తున్నా కదా రామో
ఇవేవీ వాళ్లకు కనిపించవు కదా ఖర్మో

చరణం

గ్లాసులో సూపులు తాగినా గడ్డిలాటి సలాడు నమిలినా
అద్దంలో రోజూ తగ్గానేమోనని తొంగిచూస్తానే
గోకర్ణంలో నూనెను వాడినా స్వీట్లకే మూతి ముడిచినా
Junk ఫుడ్డుకి ఆమడ దూరం దౌడే తీసానే

కుండపోతగా నేతిని వాడిన వాడినే
నేడు తుంపరంతగా వాడుతుంటినే
అంతగా ప్రియమైన చిరుతిళ్ళనే
ఇంతగా చిటికంతగా నాకుటుంటినే

బట్ట ఉన్నా పొట్ట ఉన్నా అది నా problemmu రో
బంక మన్నై నన్ను పట్టి మీరిక పీడించవద్దురో
వేలినిట్ఠా నావైపే చూపి నన్నే గేలి చెయ్యవద్దులే
కాలి కింది చెప్పుతోటి నన్నే కొట్టినట్టే ఉంటదే.

Tuesday, December 31, 2019

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2020

నిశి రాతిరి నెమ్మదిలో
నిర్వేదపు నీ మదిలో
నలిగిన నీ ఎదలో
నిన్నటిని నిదుర పుచ్చి

నందనమైన నందిని నీ ఎదురుగా ఉన్నది
నందనందనుడి తోడే నీకిక ఉన్నది
నందివాహనుడి దీవెన ఉన్నది
నాందియే ఇది నీ బంగరు భవితకి

నిన్నటిని చూసి నీరుగారకు
నిశితమైన చూపులతో రేపటికై కదులు
నీ తీరుని చూసిన నీ వైరికిక హడలు
నీతిగా మసలి విజేతగా వెలుగు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు

Happy New Year

Wednesday, July 3, 2019

First Class parody song


पिछले साल की तुलना में
वजनदार है झोली
जैसे जैसे तरकारी की थैली।

पहाड़ जैसे home work ने
 Free time किया खाली
अब तो सब कुछ रह गया खाली।

पकडली school की दिशा
आधी नींद का है नशा
साथ में भूख और प्यास है...
बेटा मेरा अब first class है
बेटा मेरा अब first class है
आज से
बेटा मेरा अब first class है

(अंतरा 1)
नए नए दोस्त और नया है कमरा
जिसे देख के निखरा उसका चेहरा
ये तो बचपन की मासूम निशानी हैं।

दिन भर चलता पढ़ना लिखना
Recess में तो खेलना और खूढना
यही दिनचर्या बेहद न्यारी है।

चेहरे पे मुस्कान लिए जाता है सुबह कभी शाम को आता उधास है।
बेटा मेरा अब first class है।
बेटा मेरा अब first class है।
आज से
बेटा मेरा अब first class है।

(अंतरा 2)
लगी चर्चा शहर में सारा
लूटें fees पूरा पेटी भरा
अब हैं तो और भी schools मगर
इसकी standard है ऊंचा ज़रा
इसकी standard है ऊंचा ज़रा

अब जो भी हो ज़ोर पकड़ली है नए साल की पढ़ाई
करलो तेरे doubt को खाली
अब जो भी हो लगा रहेगा पढ़ाई का सिलसिला जारी
इसी में है ना सब की भलाई।

अब बदलेगी दिशा और सुधरेगा दशा
शिक्षा ही उसका औज़ार है •••••
बेटा मेरा अब first class है।
बेटा मेरा अब first class है।
आज से
बेटा मेरा अब first class है।

Sunday, June 30, 2019

మనసేమో బంగారం బుఱ్ఱేమో మందారం.....


నన్ను నన్నుగా చక్కగా ఉండనిచ్చేవీలే లేదండీ
నడిచే దారిలో కలుపులు తీయాలని ఆర్డరు ఒకరండి
నలుగురినీ కలుపుకు వెళ్లాలని ఆజ్ఞ ఒకరండి
నలిపేస్తున్నాయండి ఈ రెండు మరి నాకేదారో సెలవియ్యండి
మనసేమో బంగారం...
ఈ బుఱ్ఱేమో మందారం.....
సంపద పెంచుకో సుందరా అని ఒకరి వాదన
సంతృప్తే చక్కని మందురా అని ఒకరి రోదన
సత్తువ ఉన్నది కావునా సాయపడమని ఒకరి యాచన
సుతిమెత్తగా తప్పుకు వెళితే మేలని ఇంకొకరి యోచన
సాలక ఉన్నా ఇద్దరి మధ్యన సాగిలపడినా ఈ యుధ్ధాన
మనసేమో బంగారం...
ఈ బుఱ్ఱేమో మందారం.....

నీతిగా ఉండాలని ఒకరు నీటుగా బతకాలని ఒకరు
నుతికెక్కే రీతని ఒకరు నూటిలో ఒకరని ఒకరు
నాటికి నేటికి ఒకటే రీతి
నన్ను నన్నుగా ఉండనీయనిదీ పరిస్థితి
మనసేమో బంగారం...
ఈ బుఱ్ఱేమో మందారం.....

Monday, January 14, 2019

భోగి శుభాకాంక్షలు


భానుని గమనం రేపటినుంచి మారునని
భారము తగ్గి రేపటి మనమెంతో బాగుందుమని
బయలుకు త్రోసిన మైలను మండించి
భలే భలే యని ఆనందించు తరుణమిది

భగ భగ మంటల వెచ్చదనాన
బండల గుండెలు కరగాలియని
భోజనమందక బోరున ఏడ్చుచు
బారులు తీరిన బక్కటి డొక్కలు ఉండరాదు అని

భరతావనిలో ప్రతియింట బోనమునిచ్చెడి వంటింట
భాండము క్రిందన మంటలు నిత్యము వెలగాలియని
బుడ బుడమనుచు యన్నము నిత్యము ఉడకాలియని
భాగ్యములొసగెడి భోగినాడు భగవంతుని వేడెదమే


 భోగి  శుభాకాంక్షలు

Thursday, October 18, 2018

గెలుపు నీదే


వలదు అని వదలమనిన
వదులుకాక వదిలిపోని
వ్యధలు అనే వలలో చేరి
వాడిపోయిన వదనములివి

నిన్నలోని నిన్నుచూసి
నయనమందు కలలు కరిగి
నదిగ మారి పారసాగె
నీరసించి నరుడు నిలచె

నొసలలో కసిని చూడు
నాడిలోన వేడి చూడు
నారి లాగి శరము వీడు
నిశిని దునిమి వెలుగు చూడు

వజ్రమైతే నీ సంకల్పం
వర్జితమౌనులే ఇక బేలతనం
విజయులమై అందగలం
వందలమంది వందనం

Saturday, December 31, 2011

New Year.



నిన్నటి తమస్సు తరలివెళ్ళగా
రేపటి ఉషస్సు తలుపు తట్టెగా
వాకిటకొచ్చి స్వాగతంచరా
చక్కటి మనసున సంతసించరా

నిన్నటి నీటికి వంతెనేయక
సమ్మెట పోట్లకిసున్నితపడక
ఱంపపుకోతకే రత్నమొచ్చునని
రేపటి పాటకి శృతులు చేయిక

సాధనమున సాధ్యములే సమస్తము
స్థిరముగా సాధనచేయుటయే నీ ధర్మము
సిధ్ధమై తరలివచ్చు బహుమానము
సంబరాలతో వేచి ఉంది సంవత్సరము

Monday, October 31, 2011

రా రా గణపయ్యా

గజముఖ వదనా
షణ్ముఖ సోదర
దానవ భంజన రావేరా

శివ శక్తి పుత్రా
గానాదినేత
విఘ్నహంతా రావేరా

నీ కృప లేనిదే ఎట్టి కార్యములు
ఓ తృణమంతైనా కదలవుగా
నీ దయ దృక్కులు మాపై పడగా
ఆ జయ ఫలములు మాకే ఈయగారా


భయ జాడ్య నాశక
భారత లేఖక
భవానీ తనయా రావేరా

ఓ అఖువాహన 
అయ్యప్ప సోదర
ఆదిపూజితా రావేరా

శక్తి హీనుడనై నిన్నే వేడితి
విపత్తు వీడగా రావేరా
ఆరాధించినా ఆధారించవా
ఆధారము నీవే ఇకనైనారా 

ఏక దంతుడా ఓ బలవంతుడా
ఇక నా భారమంతా నీదేనయ్యా
భాగ్యములోసగాగా  రావయ్యా
భయము తొలగించగా రావయ్యా 
అభాయమునీయగా రావయ్యా 

Saturday, June 4, 2011

నిన్ను నీవు తెలుసుకో


దినకరుని దనుజులే దిగమింగాస్తుంటే
 దినమన్నది కానరాక చీకటి కమ్మేస్తే
 దారుణమేమి జరుగలేదు అది నీ భ్రమ అంటే
 ధరలోన కాసేపే గ్రహణం గడువంటే






ఆదిత్యుడికి అలసత్వము అలవాటైపొతే
అనునిత్యము కాన రాక పనిడాటేస్తుంటే
అంధకారమే ఆస్తిగా మనకందివచ్చునంటే
అరక్షణమైనా ఆ భ్రమకే మది కంపించునంటే






కలుపు కూడ పైరు తోడ పెరుగుట పరిపాటే
కలవర పడి రైతు కృషిని వదిలితే అది పెను పొరపాటే
గిరిదాటి ఈ గడ్డపైన అడుగిడుట శతృవుకు అలవాటే

గర్జించక గురక పెట్టిన భూమిక పరులసొత్తే





వన్య ప్రాణులకైన ఒక నీతి ఉన్నదిలే
వానర వంశజులకు మిగిలినది అవినీతేలే
వక్ర బుద్దుల వారసులే శాసన చేస్తే

వజ్ర బుద్దులున్నను వారినెదిరించరులే




నిలచిఉన్న నీటికే నాచు చుట్టమౌనురా
నివసించని ఇంటికే చెదలు నేస్తాలౌనురా
 నడుము బిగించి ఈదకుంటే నది డాటవురా

నామ రూపు లేకుండా సంద్రంలో మునిగిపోతవురా










Thursday, April 7, 2011

Dream Girl

ఓనమాలు దిద్దే పసివాడిలాంటి వాడిని


ఓరచూపు బాణమేసి ఓడించింది ఒక ఓణి

ఓడనెక్కి ఏడు సాగరాలు దాటి అయిన కాని

ఒడిసిపట్టుకుంటాను ఆమే నా విరిబోణి



ఎక్కడ ఇప్పుడెక్కడ నా కన్నియ ఇప్పుడెక్కడా

తక్కెడ వేసి చూసినా ఇక ఏ అందము తనకు సరితూగునా



పాల బుగ్గల భామరో

పైడి వన్నెల జాణరో

పొడుగు జడల కన్నెరో

పాదరసమంటి చురుకురో



అష్టదిక్కుల మధ్యన ఏడు వన్నెల కలయిక ఆరు ఋతువుల అల్లిక పంచవన్నెల చిలకరా



ఎక్కడ ఇప్పుడెక్కడ



నేరేడు నయనాల ఆ నీలవేణికి

నీఱేడు ఇక్కడని చూపించిరండి

నవనీత సొగసుల కోమలాంగికి

నే వేచి ఉన్నానని చెప్పిరండి



నాలుగు వేదాలు సాక్షిగా మూడు ముళ్ళు వేయగా రెండు మనసులు కలువగా ఒక్క జీవితము అవ్వదా



ఎక్కడ ఇప్పుడెక్కడ

Sunday, November 14, 2010

పల్లె పడతి

ఏ పల్లెను దాటని పచ్చికవే


చిరు జల్లుకు పూసిన మట్టి మల్లికవే

హరివిల్లుని పోలిన పూమాలికవే

ఓ చెలి నీవే నా జానకివే


నీ నగవులకే మైమరచితినే

నీ సిగలో పూవ్వవ్వగ కోరితినే

నీ మేని గాలిలో తేలితినే

ఓ సఖి నిన్నే వలచితినే


నీ మేని వంపులను గాంచగనే

పూవింటి స్వామి ఝల్లన పులకించే

నీ తోడుగ నన్నే తనెంచే

అది నీ మనసుకి తెలిసేదెన్నటికే


నీ అందెల రవముకు కోయిల పాడేనే

నీ గళ శ్రుతులకు నెమళ్ళు ఆడేనే

నీ పలుకుల జిలుగుకు చిలుకలు మూగాయే

నేనైతే చేతనమే విడనాడితినే


పొద్దుగూకే తరుణాన

నీ గుబురు కురులను జడ వేయగనే

చీకటి పొరలే తొలగితివే

నీ ముఖ కంతే పగటిని వెలిగించేనే


ఓ ఇభగమనా నను గాంచవు ఎందుకటే

నా మొరవిని ఇటు రావెందుకటే

నన్ను చేరగ నీవొస్తేనే

నా ప్రాణము ఇకపై నిలుచునటే

Friday, October 8, 2010

Efforts will not fail.

ఎన్నెన్నో ధ్యాసలతోటి


ఎన్నెన్నో భావిచూపులతోటి

ఎంతెంతో విశ్వాశంతోటి

ఈ కడలిలో అడుగెట్టి



అలలను అలవోకగ ఈదగ

అలుపన్నది ఆసలెన్నడు ఎరుగక

ఆవలి ఒడ్డుకు ముందుగ చేరగ

ఆకలి దప్పులు మరచి తలచెగా



ముసి ముసి నగవుల బాలునిగ వచ్చి

మురిపాల లాలననే కాంక్షించి

మలి మెట్టుని ఎక్కగ సాయముకై చూసి

మార్గదర్శులకై మర్గముననే నిలచెను



కాలము ముందుకు కదిలెను తప్ప

కలచి వేసే మనసో పక్క

కాంక్షించే మది ఓ పక్క

కమిలింది ఆ జీవుని భవిత



సమ్మెట పోట్లకు సిరి గుండియ పగిలెను

సెగలకు ఆ మనసే మరిగెను

సాగుకు సరిపడు ఆ మెథోక్షేత్రము

సానుకూలతకు ఆర్రులుజాచెను



విధులలో దృష్టిని నిలుపలేక

విధిని నిందించక నిలువలేక

వధకు గురియగు మంచితనమున

వాలముగ మారును వంచనము



ఓ భగవాన్ ఇటు చూడవయ్యా

ఓ నిండు జీవితము కరుగుచున్నదయ్య

ఓ చిన్న ఆశను నాటవయ్యా

ఓ స్వావలమ్బననే చేర్చవయ్యా



చిరునవ్వుతో పెను పోట్లను తట్టుకొనిన

చిరు గాలితో పెను సెగలను సాగనంపిన

చిరకాలం నిను నువ్వు నమ్ముకొనిన

చిరంజీవివై గెలుపొందెదవని బుద్ధి కూర్చవయ్యా.