
దినకరుని దనుజులే దిగమింగాస్తుంటే
దినమన్నది
కానరాక చీకటి కమ్మేస్తే
దారుణమేమి
జరుగలేదు అది నీ భ్రమ అంటే
ధరలోన
కాసేపే గ్రహణం గడువంటే
ఆదిత్యుడికి అలసత్వము అలవాటైపొతే
అనునిత్యము
కాన రాక పనిడాటేస్తుంటే
అంధకారమే
ఆస్తిగా మనకందివచ్చునంటే
అరక్షణమైనా
ఆ భ్రమకే మది కంపించునంటే
కలుపు కూడ పైరు తోడ పెరుగుట పరిపాటే
కలవర
పడి రైతు కృషిని వదిలితే అది పెను పొరపాటే
గిరిదాటి
ఈ గడ్డపైన అడుగిడుట శతృవుకు అలవాటే
గర్జించక గురక పెట్టిన భూమిక
పరులసొత్తే
వన్య ప్రాణులకైన ఒక నీతి ఉన్నదిలే
వానర వంశజులకు మిగిలినది అవినీతేలే
వక్ర బుద్దుల వారసులే శాసన చేస్తే
వజ్ర బుద్దులున్నను
వారినెదిరించరులే
నిలచిఉన్న నీటికే నాచు చుట్టమౌనురా
నివసించని ఇంటికే చెదలు
నేస్తాలౌనురా
నడుము బిగించి ఈదకుంటే నది డాటవురా
నామ రూపు లేకుండా సంద్రంలో
మునిగిపోతవురా