Friday, October 8, 2010

Efforts will not fail.

ఎన్నెన్నో ధ్యాసలతోటి


ఎన్నెన్నో భావిచూపులతోటి

ఎంతెంతో విశ్వాశంతోటి

ఈ కడలిలో అడుగెట్టి



అలలను అలవోకగ ఈదగ

అలుపన్నది ఆసలెన్నడు ఎరుగక

ఆవలి ఒడ్డుకు ముందుగ చేరగ

ఆకలి దప్పులు మరచి తలచెగా



ముసి ముసి నగవుల బాలునిగ వచ్చి

మురిపాల లాలననే కాంక్షించి

మలి మెట్టుని ఎక్కగ సాయముకై చూసి

మార్గదర్శులకై మర్గముననే నిలచెను



కాలము ముందుకు కదిలెను తప్ప

కలచి వేసే మనసో పక్క

కాంక్షించే మది ఓ పక్క

కమిలింది ఆ జీవుని భవిత



సమ్మెట పోట్లకు సిరి గుండియ పగిలెను

సెగలకు ఆ మనసే మరిగెను

సాగుకు సరిపడు ఆ మెథోక్షేత్రము

సానుకూలతకు ఆర్రులుజాచెను



విధులలో దృష్టిని నిలుపలేక

విధిని నిందించక నిలువలేక

వధకు గురియగు మంచితనమున

వాలముగ మారును వంచనము



ఓ భగవాన్ ఇటు చూడవయ్యా

ఓ నిండు జీవితము కరుగుచున్నదయ్య

ఓ చిన్న ఆశను నాటవయ్యా

ఓ స్వావలమ్బననే చేర్చవయ్యా



చిరునవ్వుతో పెను పోట్లను తట్టుకొనిన

చిరు గాలితో పెను సెగలను సాగనంపిన

చిరకాలం నిను నువ్వు నమ్ముకొనిన

చిరంజీవివై గెలుపొందెదవని బుద్ధి కూర్చవయ్యా.