Monday, January 14, 2019

భోగి శుభాకాంక్షలు


భానుని గమనం రేపటినుంచి మారునని
భారము తగ్గి రేపటి మనమెంతో బాగుందుమని
బయలుకు త్రోసిన మైలను మండించి
భలే భలే యని ఆనందించు తరుణమిది

భగ భగ మంటల వెచ్చదనాన
బండల గుండెలు కరగాలియని
భోజనమందక బోరున ఏడ్చుచు
బారులు తీరిన బక్కటి డొక్కలు ఉండరాదు అని

భరతావనిలో ప్రతియింట బోనమునిచ్చెడి వంటింట
భాండము క్రిందన మంటలు నిత్యము వెలగాలియని
బుడ బుడమనుచు యన్నము నిత్యము ఉడకాలియని
భాగ్యములొసగెడి భోగినాడు భగవంతుని వేడెదమే


 భోగి  శుభాకాంక్షలు

No comments:

Post a Comment