Sunday, November 14, 2010

పల్లె పడతి

ఏ పల్లెను దాటని పచ్చికవే


చిరు జల్లుకు పూసిన మట్టి మల్లికవే

హరివిల్లుని పోలిన పూమాలికవే

ఓ చెలి నీవే నా జానకివే


నీ నగవులకే మైమరచితినే

నీ సిగలో పూవ్వవ్వగ కోరితినే

నీ మేని గాలిలో తేలితినే

ఓ సఖి నిన్నే వలచితినే


నీ మేని వంపులను గాంచగనే

పూవింటి స్వామి ఝల్లన పులకించే

నీ తోడుగ నన్నే తనెంచే

అది నీ మనసుకి తెలిసేదెన్నటికే


నీ అందెల రవముకు కోయిల పాడేనే

నీ గళ శ్రుతులకు నెమళ్ళు ఆడేనే

నీ పలుకుల జిలుగుకు చిలుకలు మూగాయే

నేనైతే చేతనమే విడనాడితినే


పొద్దుగూకే తరుణాన

నీ గుబురు కురులను జడ వేయగనే

చీకటి పొరలే తొలగితివే

నీ ముఖ కంతే పగటిని వెలిగించేనే


ఓ ఇభగమనా నను గాంచవు ఎందుకటే

నా మొరవిని ఇటు రావెందుకటే

నన్ను చేరగ నీవొస్తేనే

నా ప్రాణము ఇకపై నిలుచునటే