Saturday, December 31, 2011

New Year.



నిన్నటి తమస్సు తరలివెళ్ళగా
రేపటి ఉషస్సు తలుపు తట్టెగా
వాకిటకొచ్చి స్వాగతంచరా
చక్కటి మనసున సంతసించరా

నిన్నటి నీటికి వంతెనేయక
సమ్మెట పోట్లకిసున్నితపడక
ఱంపపుకోతకే రత్నమొచ్చునని
రేపటి పాటకి శృతులు చేయిక

సాధనమున సాధ్యములే సమస్తము
స్థిరముగా సాధనచేయుటయే నీ ధర్మము
సిధ్ధమై తరలివచ్చు బహుమానము
సంబరాలతో వేచి ఉంది సంవత్సరము

Monday, October 31, 2011

రా రా గణపయ్యా

గజముఖ వదనా
షణ్ముఖ సోదర
దానవ భంజన రావేరా

శివ శక్తి పుత్రా
గానాదినేత
విఘ్నహంతా రావేరా

నీ కృప లేనిదే ఎట్టి కార్యములు
ఓ తృణమంతైనా కదలవుగా
నీ దయ దృక్కులు మాపై పడగా
ఆ జయ ఫలములు మాకే ఈయగారా


భయ జాడ్య నాశక
భారత లేఖక
భవానీ తనయా రావేరా

ఓ అఖువాహన 
అయ్యప్ప సోదర
ఆదిపూజితా రావేరా

శక్తి హీనుడనై నిన్నే వేడితి
విపత్తు వీడగా రావేరా
ఆరాధించినా ఆధారించవా
ఆధారము నీవే ఇకనైనారా 

ఏక దంతుడా ఓ బలవంతుడా
ఇక నా భారమంతా నీదేనయ్యా
భాగ్యములోసగాగా  రావయ్యా
భయము తొలగించగా రావయ్యా 
అభాయమునీయగా రావయ్యా 

Saturday, June 4, 2011

నిన్ను నీవు తెలుసుకో


దినకరుని దనుజులే దిగమింగాస్తుంటే
 దినమన్నది కానరాక చీకటి కమ్మేస్తే
 దారుణమేమి జరుగలేదు అది నీ భ్రమ అంటే
 ధరలోన కాసేపే గ్రహణం గడువంటే






ఆదిత్యుడికి అలసత్వము అలవాటైపొతే
అనునిత్యము కాన రాక పనిడాటేస్తుంటే
అంధకారమే ఆస్తిగా మనకందివచ్చునంటే
అరక్షణమైనా ఆ భ్రమకే మది కంపించునంటే






కలుపు కూడ పైరు తోడ పెరుగుట పరిపాటే
కలవర పడి రైతు కృషిని వదిలితే అది పెను పొరపాటే
గిరిదాటి ఈ గడ్డపైన అడుగిడుట శతృవుకు అలవాటే

గర్జించక గురక పెట్టిన భూమిక పరులసొత్తే





వన్య ప్రాణులకైన ఒక నీతి ఉన్నదిలే
వానర వంశజులకు మిగిలినది అవినీతేలే
వక్ర బుద్దుల వారసులే శాసన చేస్తే

వజ్ర బుద్దులున్నను వారినెదిరించరులే




నిలచిఉన్న నీటికే నాచు చుట్టమౌనురా
నివసించని ఇంటికే చెదలు నేస్తాలౌనురా
 నడుము బిగించి ఈదకుంటే నది డాటవురా

నామ రూపు లేకుండా సంద్రంలో మునిగిపోతవురా










Thursday, April 7, 2011

Dream Girl

ఓనమాలు దిద్దే పసివాడిలాంటి వాడిని


ఓరచూపు బాణమేసి ఓడించింది ఒక ఓణి

ఓడనెక్కి ఏడు సాగరాలు దాటి అయిన కాని

ఒడిసిపట్టుకుంటాను ఆమే నా విరిబోణి



ఎక్కడ ఇప్పుడెక్కడ నా కన్నియ ఇప్పుడెక్కడా

తక్కెడ వేసి చూసినా ఇక ఏ అందము తనకు సరితూగునా



పాల బుగ్గల భామరో

పైడి వన్నెల జాణరో

పొడుగు జడల కన్నెరో

పాదరసమంటి చురుకురో



అష్టదిక్కుల మధ్యన ఏడు వన్నెల కలయిక ఆరు ఋతువుల అల్లిక పంచవన్నెల చిలకరా



ఎక్కడ ఇప్పుడెక్కడ



నేరేడు నయనాల ఆ నీలవేణికి

నీఱేడు ఇక్కడని చూపించిరండి

నవనీత సొగసుల కోమలాంగికి

నే వేచి ఉన్నానని చెప్పిరండి



నాలుగు వేదాలు సాక్షిగా మూడు ముళ్ళు వేయగా రెండు మనసులు కలువగా ఒక్క జీవితము అవ్వదా



ఎక్కడ ఇప్పుడెక్కడ