Thursday, April 7, 2011

Dream Girl

ఓనమాలు దిద్దే పసివాడిలాంటి వాడిని


ఓరచూపు బాణమేసి ఓడించింది ఒక ఓణి

ఓడనెక్కి ఏడు సాగరాలు దాటి అయిన కాని

ఒడిసిపట్టుకుంటాను ఆమే నా విరిబోణి



ఎక్కడ ఇప్పుడెక్కడ నా కన్నియ ఇప్పుడెక్కడా

తక్కెడ వేసి చూసినా ఇక ఏ అందము తనకు సరితూగునా



పాల బుగ్గల భామరో

పైడి వన్నెల జాణరో

పొడుగు జడల కన్నెరో

పాదరసమంటి చురుకురో



అష్టదిక్కుల మధ్యన ఏడు వన్నెల కలయిక ఆరు ఋతువుల అల్లిక పంచవన్నెల చిలకరా



ఎక్కడ ఇప్పుడెక్కడ



నేరేడు నయనాల ఆ నీలవేణికి

నీఱేడు ఇక్కడని చూపించిరండి

నవనీత సొగసుల కోమలాంగికి

నే వేచి ఉన్నానని చెప్పిరండి



నాలుగు వేదాలు సాక్షిగా మూడు ముళ్ళు వేయగా రెండు మనసులు కలువగా ఒక్క జీవితము అవ్వదా



ఎక్కడ ఇప్పుడెక్కడ