Monday, October 31, 2011

రా రా గణపయ్యా

గజముఖ వదనా
షణ్ముఖ సోదర
దానవ భంజన రావేరా

శివ శక్తి పుత్రా
గానాదినేత
విఘ్నహంతా రావేరా

నీ కృప లేనిదే ఎట్టి కార్యములు
ఓ తృణమంతైనా కదలవుగా
నీ దయ దృక్కులు మాపై పడగా
ఆ జయ ఫలములు మాకే ఈయగారా


భయ జాడ్య నాశక
భారత లేఖక
భవానీ తనయా రావేరా

ఓ అఖువాహన 
అయ్యప్ప సోదర
ఆదిపూజితా రావేరా

శక్తి హీనుడనై నిన్నే వేడితి
విపత్తు వీడగా రావేరా
ఆరాధించినా ఆధారించవా
ఆధారము నీవే ఇకనైనారా 

ఏక దంతుడా ఓ బలవంతుడా
ఇక నా భారమంతా నీదేనయ్యా
భాగ్యములోసగాగా  రావయ్యా
భయము తొలగించగా రావయ్యా 
అభాయమునీయగా రావయ్యా