భానుని గమనం రేపటినుంచి మారునని
భారము తగ్గి రేపటి మనమెంతో
బాగుందుమని
బయలుకు త్రోసిన మైలను మండించి
భలే భలే యని ఆనందించు తరుణమిది
భగ భగ మంటల వెచ్చదనాన
బండల గుండెలు కరగాలియని
భోజనమందక బోరున ఏడ్చుచు
బారులు తీరిన బక్కటి డొక్కలు ఉండరాదు
అని
భరతావనిలో ప్రతియింట బోనమునిచ్చెడి
వంటింట
భాండము క్రిందన మంటలు నిత్యము
వెలగాలియని
బుడ బుడమనుచు యన్నము నిత్యము
ఉడకాలియని
భాగ్యములొసగెడి భోగినాడు భగవంతుని
వేడెదమే
భోగి శుభాకాంక్షలు