వెలిగేటి దివ్వెను వెలుగులో
వేలుగీయలేదనుచు వేలెత్తి దానిని నిందించనేల
వలయు
చీకట్లు కనుగొని అచ్చోట నిలిపిన ఆ వెలుగే మనకు కనిపించు చాల
జడివాన
కురియగా నదులు జలజలా పారగా ఆ జలధారనంతా జారవిడువనేల
జలముకై
పుడమినే గుచ్చి గుచ్చి భూజల జాడనే తుడిచిపెట్టనేల
తడినేల
ఓ వైపు పొడినేల ఓ వైపు నిలిచేతి ఈ వింత వైనమింకెంతసేపు
తడి
నిలువ చేసుకొని దారినే మార్చగా పొడి గొంతు తడిసి మరుభూమి విరియగా ఇంకెంతసేపు
ఆకలి
మించిన భోజనం బడలిక మించిన శయనం ఓ వైపు ఇది కనువిందు చేసేటి
ఆ
కలి మీరి బువ్వ దొరకక నిదుర మరిచేరు కొందరు మరు వైపు ఇది కాన్చాగా హృదయమే ఛిద్రం
అవసరం
గాంచి సమతౌల్యం సాధిద్దాం
అవనిలో
జనులెల్ల సమమేనని చాటుదాం
No comments:
Post a Comment