Thursday, October 18, 2018

గెలుపు నీదే


వలదు అని వదలమనిన
వదులుకాక వదిలిపోని
వ్యధలు అనే వలలో చేరి
వాడిపోయిన వదనములివి

నిన్నలోని నిన్నుచూసి
నయనమందు కలలు కరిగి
నదిగ మారి పారసాగె
నీరసించి నరుడు నిలచె

నొసలలో కసిని చూడు
నాడిలోన వేడి చూడు
నారి లాగి శరము వీడు
నిశిని దునిమి వెలుగు చూడు

వజ్రమైతే నీ సంకల్పం
వర్జితమౌనులే ఇక బేలతనం
విజయులమై అందగలం
వందలమంది వందనం

No comments:

Post a Comment