Sunday, June 30, 2019

మనసేమో బంగారం బుఱ్ఱేమో మందారం.....


నన్ను నన్నుగా చక్కగా ఉండనిచ్చేవీలే లేదండీ
నడిచే దారిలో కలుపులు తీయాలని ఆర్డరు ఒకరండి
నలుగురినీ కలుపుకు వెళ్లాలని ఆజ్ఞ ఒకరండి
నలిపేస్తున్నాయండి ఈ రెండు మరి నాకేదారో సెలవియ్యండి
మనసేమో బంగారం...
ఈ బుఱ్ఱేమో మందారం.....
సంపద పెంచుకో సుందరా అని ఒకరి వాదన
సంతృప్తే చక్కని మందురా అని ఒకరి రోదన
సత్తువ ఉన్నది కావునా సాయపడమని ఒకరి యాచన
సుతిమెత్తగా తప్పుకు వెళితే మేలని ఇంకొకరి యోచన
సాలక ఉన్నా ఇద్దరి మధ్యన సాగిలపడినా ఈ యుధ్ధాన
మనసేమో బంగారం...
ఈ బుఱ్ఱేమో మందారం.....

నీతిగా ఉండాలని ఒకరు నీటుగా బతకాలని ఒకరు
నుతికెక్కే రీతని ఒకరు నూటిలో ఒకరని ఒకరు
నాటికి నేటికి ఒకటే రీతి
నన్ను నన్నుగా ఉండనీయనిదీ పరిస్థితి
మనసేమో బంగారం...
ఈ బుఱ్ఱేమో మందారం.....

4 comments: