ఎవ్వరు ఎవ్వరు ఎవ్వరివయ్యా ఓ మనిషీ
నీకెవ్వరు ఎవ్వరు ఎవ్వరు అయ్యా ఓ మనిషీ
తూలుతు తేలుతు పడుతు నిలుస్తు ఓ మనిషీ
ఈ నడకెందాకయ్యా ఓ మనిషీ
గమ్యము లేని గమనములోనా ఓ మనిషీ
గల్లంతౌతావేమో ఓ మనిషీ
నా మాట వినవయ్యా నీ బాట మార్చవయ్యా .... (2)
కరుణను వదలిన కాఠిన్యమది కసితో మిగిలే నిశి రాతిరది
జటలుగ పెరిగిన జటిలమదీ జలమునందలి గరళమది
తేనెలు పూసిన ఖడ్గమది తేలికగా చీల్చేయునది
కాసుకు మెరిసే ముఖము ఇది కనిపించని పార్స్వము వేరొకటుంది
అదుపు చేయకపోతే ఈ భడభాగ్నీ కర్చిచ్చై కానల కల్చును సుమి
తెలివిగ మసలుకో ఓ మనిషి లేదా మిగులును ఓ మహిషి
మారవ మారవ మారవ ఓ మనిషీ
మానవుడంటే మాధవ రూపే ఓ మనిషీ
పంచ భూతములతో పంచ ప్రాణములను కూర్చి
దేవళమంటి దేహమున నిలిపి బుద్దినే రథముగ చేసి
పంచేంద్రియములను తురగములగ మార్చి
దైవత్వమును పొందుటకు పలు మార్గముల నొసగెను
తలపై నిలచిన అనంత ఆకాశపు అవదులకే అద్దముగా
తలలో నిలిపెను అనంత ప్రశ్నల చీల్చే మెథొగంగా
తోటి ప్రాణులు తల్లడిల్లెదరు దానిని తప్పునక్కు వాడంగా
తమస్సులోనే ఉషస్సు రాదా దానిని సైరిగా వాడంగా
కడుపులోన జఠరాగ్ని శ్వాసలోన ఆశాగ్ని భాషలోన భావాగ్ని
తలపులోన ఙ్నానాగ్ని కనులలోన సమరాగ్ని ఆ మహాగ్ని రూపములే
విచక్షణ వీడిన కానల కాల్చు కార్చిచ్చేలే
వివేచన కల్గిన తిమిరం కడదేర్చు కరదీపికలే
మనుషులందరి తనువుల్లో పెను భాగం జలమే
భష్పములోనా స్వేదములోన నిలచినది ఆ జలమే
అత్యాసతో పరులను బాధించిన, వారు చిందించెడి రుధిరం కుడా జలమే
అతిప్రేమతో మనసు కరుగగా ఆ తడిలోనా జలమేలే
ఉసురు నిలిపెడి ఊపిరి ఆ వాయువునకు ప్రతిరూపమురా
ఊసులాడెటి మాటల్లో మనసు మీటెడి సంగీతంలో
సృష్టి మూలమైన ఓంకారంలో నిలచినది ఆ వయువురా
మంచిని పీల్చు ఉఛ్ఛ్వాసల్లో చెడుని విడిల్చు నిఛ్ఛ్వాసల్లో
మనము నిలచినది భూమి మనల నడిపేది భూమి
ప్రాణము నిల్పు తరువుకైనా మానము నిల్పు వలువుకైనా
పసిడికైనా ఇంధనముకైనా నెలవు కదరా ఈ పుడమి
ఎంత వారికైనా అదే తుది మజిలీ ఈ నిక్కమెరుగు ఇకనైనా
పంచ భూతముల శక్తితో పంచేంద్రియ సహకారంతో
అరిషడ్వర్గములకు బానిసవ్వక హరి ప్రసాదమునందుకో
పరమావదినే చేరుకో పరమానందమునందుకో
ఎవరు ఎవరు ఎవరినయా ఓ మనిషీ
నీకు చెప్పగ చెప్పగ నేనెవరినయ్య ఓ మనిషీ
No comments:
Post a Comment