కరి మబ్బే కన్నెర్ర చేస్తే
వరి భూమే మరు భూమి అవ్వదా
ఆ మబ్బే కన్నీరు పెడితే
నేలంతా నీటమునగదా
గుండెలోని గంగ నీరే
గగనమే నేలకొదలగా
గరిటడైన నిలువ ఉండలేదులే
గట్టులున్న చెరువు లేకనే
నీటి నేల నాటిదవ్వగా
నేటి నేల నీట మునిగెగా
నీటి నేల నీటికొదిలితే
గూటిలోన నీరు నిలుచునా
జగమందలి కొంత భాగమే
జనులకై నీరు వుందిరా
జలగలవలె నేలను పీల్చితే
జల ప్రళయము రాక తప్పునా
మబ్బునాపెడి కొండలేవి
మట్టినాపెడి అడవులేవి
మితిమీరి అడవికొడితే
మన నోటిన మట్టి కొట్టినట్లే
ఆకాశ గంగకు ఆహ్వానమంపుదాం
నేల గంగకు ఆసనమేద్దాం
కూటికప్పుడు కొదవ ఉండదే
గూటికి ముప్పు ఉండదే
No comments:
Post a Comment